ప్రముఖ నటి జయప్రద తన సోదరి కుమారుడు సిద్ధార్థ్ ను హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు తమిళ చిత్ర రంగాన్ని ఎంచుకుంటున్నారామె. ఇటీవల నితిన్, నిత్యామీనన్ జంటగా తెలుగులో వచ్చిన ‘ఇష్క్’ చిత్రాన్ని రీమేక్ చేయడం ద్వారా తన వారసుడిని వెండితెరకు పరిచయం చేస్తున్నారామె. ఇందుకోసం ఈ చిత్రం రీమేక్ హక్కుల్ని మంచి రేటుకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఏ.రాజశేఖర్ దర్శకత్వం వహిస్తాడు. ఇక ఇందులో హీరోయిన్ గా ఒరిజినల్ వెర్షన్లో నటించిన నిత్యామీనన్ ను ఎంపిక చేయచ్చని అంటున్నారు. ఈ విషయంపై ఆమెతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి!
Tuesday, September 18, 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment