Sponcers

Sponsers

Tuesday, September 18, 2012

విక్రమ్ సినిమాకు 8 మంది సంగీత దర్శకులు


తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న ‘డేవిడ్’ చిత్రం చాలా విశేషాలను మూటగట్టుకుంటోంది. బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెండు కథలు సమాంతరంగా సాగుతుంటాయి. రెండు కథల్లోనూ హీరో పేరు డేవిడ్. మరో డేవిడ్ గా జీవా నటిస్తున్నాడు. విక్రమ్ మత్స్యకారుడిగా, జీవా సంగీతకారుడిగా కనిపిస్తారు. అలాగే ఇద్దరు కేమేరామేన్లు దీనికి పని చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో విశేషమేమిటంటే, ఈ సినిమాకు ఏకంగా ఎనిమిది మంది సంగీత దర్శకులు పనిచేస్తున్నారట. ఎనిమిది మందీ కూడా జాతీయ, అంతర్జాతీయంగా పేరున్న వారు కావడం మరో విశేషం. ఇందులో లారా దత్తా, టబు, ఇషా శర్వాణీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

No comments: